Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 నుంచి మళ్లీ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (09:26 IST)
సుమారు 10 నెలల వ్యవధి తర్వాత మళ్లీ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కి కూతపెట్టనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందనున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది. తిరుపతి- ఆదిలాబాద్‌ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ మొత్తం 59 స్టేషన్లలో ఆగుతుంది.
 
ఈ రైలు ప్రతీ రోజూ ఉదయం 5.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, మల్కాజిగిరికి రాత్రి 9 గంటలకు.. ఆదిలాబాద్‌ మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో.. ఆదిలాబాద్‌ నుంచి రాత్రి 9.05 గంటలకు బయలుదేరి.. మల్కాజిగిరికి మరుసటి రోజు ఉదయం 5.15 గంటలకు.. అదే రోజు రాత్రి 9.35 గంటలకు తిరుపతి చేరుతుంది.

సికింద్రాబాద్‌-మణుగూరు-సికింద్రాబాద్‌ (నెం.02745/02746), కాచిగూడ-యల్హంక-కాచిగూడ (నెం.07603/07604), గుంటూరు-రాయగడ-గుంటూరు (నెం.07244/07243), కాకినాడపోర్టు-తిరుపతి-కాకినాడపోర్టు (నెం.07249/07250) రైళ్లను కూడా రైల్వే శాఖ ఈ నెల 27, 28, 29 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానుంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments