Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌కు 26 మంది లారీ డ్రైవర్లు - మంచిర్యాలలో ఆరు పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 13 మే 2020 (21:22 IST)
కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని పోయిన వలస కూలీలు తమతమ సొంత రాష్ట్రాలకు వస్తున్నారు. అలా వచ్చే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో కరోనా పాజిటివ్ అని తేలుతోంది. అలా మంచిర్యాల జిల్లాలో ఆరుగురు వలస కూలీలకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. 
 
ఈ కరోనా బాధితులను అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలో 9 మంది వలస కూలీలు కరోనా బారిన పడ్డారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలోనూ ఎలాంటి పాజిటివ్‌ కేసులు లేవు. 
 
పల్లెల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని అనుకుంటున్న సమయంలో ఏప్రిల్‌ 14న చెన్నూర్‌ మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన మహిళ మరణం కరోనా వల్లనే సంభవించిందని తేలింది. 
 
జిల్లాలో మరో ఆరుగురు ముంబై వలస కూలీలకు కరోనా సోకింది. బాధితుల్లో హజీపూర్ మండలానికి చెందిన నలుగురు, దండేపల్లి మండలం నర్సాపూర్‌లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారించారు. 
 
అలాగే, ముంబై నుంచి వచ్చిన 120 మంది వలస కార్మికుల విషయంలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. వారిని గుర్తించి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. 
 
మరోవైపు, నెల్లూరు జిల్లా పొదలకూరు సర్కిల్ పరిధిలోని 25 మంది లారీ డ్రైవర్లను క్వారంటైన్‌కు తరలించారు. వీరంతా చెన్నైలోని కోయంబేడు మార్కెట్ నుంచి కూరగాయల రవాణాతో వచ్చిన లారీ, ఆటో డ్రైవర్లుగా అధికారులు గుర్తించారు. 
 
దీంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. కోయంబేడు మార్కెట్ పరిధిలో పలువురికి కరోనా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మార్కెట్ నుంచి వచ్చిన వారిని అధికారులు క్వారంటైన్‌కు పంపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments