Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ పాజిటివ్, ఇద్దరు కొడుకులకీ చెప్పకుండా కాలువలో దూకేశారు

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (22:43 IST)
కరోనావైరస్ ఎంతోమంది జీవితాలను ఛిద్రం చేసేస్తోంది. ఆ వైరస్ వస్తే ఇక చనిపోవడమనే నమ్మేవారి సంఖ్య పెరుగుతోంది. కనీసం చికిత్స చేయించుకునేందుకు సైతం ప్రయత్నించకుండా తనువు చాలిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధ దంపతులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
 
తమకు కరోనా పాజిటివ్ వుందని పరీక్షల్లో తేలడంతో వృద్ధ దంపతులు భయంకరమైన వైరస్ వల్ల చనిపోతారనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరిలోని రాయవరం మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన కర్రి వెంకట్ రెడ్డి (71), సావిత్రి దంపతులు మండపేట కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
వ్యవసాయం ద్వారా జీవనం సాగించే వెంకట్ రెడ్డి, సావిత్రి ఈ నెల 12వ తేదీన కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అప్పటి నుండి హోం ఐసోలేషన్లో వుంటున్నారు. వెంకట్ రెడ్డి, సావిత్రికి ఇద్దరు కుమారులు. వ్యాపార రీత్యా ఒకరు ఒడిశాలో వుంటుండగా మరొకరు రాజమండ్రిలో నివశిస్తున్నారు.
 
కాగా ఈ నెల 12వ తేదీ నుండి ఈ జంట ఇంట్లో ఒంటరిగా వుంటున్నారు. ఐతే ఒక రోజంతా ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి వారి కుమారుడికి సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రుల ఆచూకి లేదు. సాయంత్రం మండపేట కాలువలోని మాచవరం గ్రామ సమీపంలో రెండు మృతదేహాలు లభించాయని వార్త రావడంతో అక్కడికెళ్లి చూడగా వారు తమ తల్లిదండ్రులను గుర్తించాడు. కరోనా కారణంగా చనిపోతామన్న భయంతో వారు ఆత్మహత్య చేసుకుని వుండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments