Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సారీ తల్లీ.. కుమార్తెతో కాళ్లు చేతులు కట్టించుకుని టెక్కీ సూసైడ్.. ఎక్కడ?

Advertiesment
Vijayawada
, ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (09:51 IST)
కరోనా కష్టకాలంలో అనేక మంది జీవితాలు తలకిందులైపోతున్నాయి. ఉపాధిని కోల్పోయిన టెక్కీలు.. జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలో తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన కుమార్తెతో కాళ్లు చేతులు కట్టించుకుని సూసైడ్ చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ఒకవైపు భార్య అనారోగ్యంతో బాధపడుతుంటే, మరోవైవు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో కుమార్తె సాహం తీసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అలాగే, కుమార్తె కూడా తనతోపాటు ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించాడు. ఫలితంగా అభంశుభం తెలియని చిన్నారి కూడా ప్రాణాలు తీసుకుంది.
 
ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన జాగా రవి (38) కొన్నాళ్లపాటు ఓ వెలుగు వెలిగాడు. లాక్డౌన్‌.. రవి జీవితంలో చీకటి రోజులను తీసుకొచ్చింది. ముందు ఉద్యోగం పోయింది. కుటుంబంతో కలిసి విజయవాడలోని సత్యనారాయణపురం వచ్చిన కొన్నిరోజులకు అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్న అమ్మమ్మ చనిపోయింది. 
 
రవిని చిన్నతనం నుంచి ఆమే పెంచి పెద్ద చేసింది. దీంతో గదిలో తన అమ్మమ్మ ఫొటో వద్ద 'ఐ నీడ్‌ హెల్ప్‌ మామ్మ..' అని రాసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్య భరణికి మూత్రపిండాల వ్యాధి డయాలసిస్‌ చేసే స్థాయికి వెళ్లింది. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో రవి ఉండటంతో భరణికి వైద్యం చేయించే బాధ్యతలను ఆమె కుటుంబీకులు తీసుకున్నారు. గ
 
వర్నరుపేటలో ఉన్న తల్లి వద్ద భరణి ఉంటూ డయాలసిస్‌ చేయించుకుంటోంది. కుమార్తె సహస్రతో కలిసి రవి సత్యనారాయణపురంలో ఉంటున్నాడు. ఇలా రోజురోజుకూ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. అన్నింటికీ ఆత్మహత్య ఒక్కటే పరిష్కారమనుకున్నాడు.
 
తాను చనిపోయిన తర్వాత కుమార్తె సహస్ర తన భార్యకు భారం కాకూడదని భావించి ఆమెనూ ఆత్మహత్యకు ప్రేరేపించాడు. చనిపోయే ముందు మూడు లేఖలు రాసి గదిలో గోడలకు అతికించాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఒక లేఖలో రాస్తే, సహస్రను ఆత్మహత్యకు ప్రేరేపించి ప్రాణం తీసుకునేలా చేసినందుకు 'బుజ్జితల్లీ.. సారీ..' అంటూ మరో లేఖ రాశాడు. 
 
'ప్లీజ్‌ డొనేట్‌ మై ఆర్గాన్స్‌ టే నీడీ అండ్‌ డొనేట్‌ మై కిడ్నీస్‌ టు భరణి' అని మరో లేఖను రాశాడు. వీటిని సత్యనారాయణపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవి, సహస్ర ఎదురెదురుగా ఉరికి వేలాడుతూ కనిపించారు. దీన్ని బట్టి చూస్తే సహస్రను ఆత్మహత్యకు మానసికంగా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రవి కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. కాళ్లు, చేతులు కట్టేసుకుని ఉరి వేసుకోవడం వీలుకాదని పోలీసులు చెబుతున్నారు. 
 
కాళ్లను రవి కట్టేసుకున్నా, చేతులను మాత్రం సహస్ర కట్టిందని అనుమానిస్తున్నారు. ఆయన ఉరి తాడును మెడకు బిగించుకున్న తర్వాత సహస్ర స్టూల్‌ ఎక్కి ఉరి పోసుకుందని తెలుస్తోంది. రవి కాళ్లు, చేతులకు మాత్రమే తాళ్లు ముడివేసి ఉన్నాయి. సహస్ర మాత్రం మామూలుగా ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది. ఉరి పోసుకున్న సమయంలో అరుపులు బయటకు వినిపించకుండా ఉండటానికి కుమార్తె నోటికి ప్లాస్టర్‌ వేసి, తాను మాత్రం గుడ్డముక్కలు కుక్కుకుని ప్రాణాలొదిలాడు.
 
ఈనెల ఎనిమిదో తేదీన రవి పుట్టినరోజు. ఆ రోజే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. బంధువులంతా ఇంట్లోనే ఉండటంతో సాధ్యపడలేదు. ఈ విషయాన్ని రవి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ‘ఐ లవ్‌యూ అమ్మమ్మ. ఐ లవ్‌యూ ఉమా పిన్ని. ఐ లవ్‌యూ బుజ్జితల్లి.. సారీ తల్లి..’ అని ఒక పేపర్‌ రాశాడు. దీన్నిబట్టి చూస్తే రవి, కుమార్తెతో కలిసి పుట్టినరోజునే జీవితంలో చివరి రోజును చేసుకోవాలనుకున్నాడని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో లాక్డౌన్‌ విధించే ప్రసక్తే లేదు... ఆంక్షలు కఠినతరం : అరవింద్ కేజ్రీవాల్