Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రహిత గ్రామంగా ఉప్పరపాలెం.. ఒక్క కోవిడ్ కేసు కూడా లేదు..

Webdunia
బుధవారం, 5 మే 2021 (12:35 IST)
దేశంతో పాటు తెలుగు రాష్ట్రాలు కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండకు ఆనుకుని వున్న చిన్న పల్లెటూరు మాత్రం నిశ్చింతగా వుంటోంది. ఆ గ్రామంలో ఇప్పటిదాకా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఫలితంగా కరోనా రహిత గ్రామంగా ప్రశాంతమైన వాతావరణంలో గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు. 
 
కరోనాను ఆ గ్రామంలోకి రానీయకుండా గ్రామస్తులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. వినుకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పరపాలెంలో 4 వేల జనాభా ఉన్నారు. 
 
సర్పంచ్‌ గోపు కృష్ణ ఆధ్వర్యంలో యువత కమిటీలుగా ఏర్పడి ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ బయటి నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని ఊరి మొత్తం అప్పుడప్పుడు చల్లుతున్నారు.
 
ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఎవరికి వారు స్వచ్ఛందంగా కరోనా కట్టడికి సహకరిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీనిపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments