Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్లకు డబ్బులు లేవు పప్పుబెల్లాలకు ఉన్నాయా? గోరంట్ల

Webdunia
బుధవారం, 5 మే 2021 (12:29 IST)
రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు వేయించేందుకు డబ్బులు లేవని చెప్పడం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కానీ, జగనన్న పథకాల అమలుకు మాత్రం డబ్బులు ఉన్నాయా అని ప్రశ్నించారు. 
 
కరోనా వైరస్ కారణంగా ఏపీలో జరుగుతున్న మరణ మృదంగంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వల్ల ఎంత మంది చనిపోయారో శ్మశానాల్లో లెక్కలు తీస్తే జగన్‌ సర్కారు తల ఎత్తుకోలేదన్నారు. అర్థం లేని కక్ష సాధింపు వ్యవహారాల్లో మునిగి తేలుతున్న ముఖ్యమంత్రి తన అసమర్థతకు ఎంత మందిని బలి తీసుకొంటారోనని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పత్రికలు, టీవీల్లో తన ప్రచారానికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం కరోనా వ్యాక్సిన్‌ కొనడానికి డబ్బులు లేవని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ‘కరోనా పరీక్షల కిట్లు చాలినన్ని లేవు. ఆస్పత్రుల్లో పడకలు లేవు. వ్యాక్సిన్లు లేవు. మొదటి డోస్‌ వేయించుకొన్న వారికి రెండో డోస్‌ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు శ్మశానాల్లో స్థలం సరిపోవడం లేదు కాబట్టి, జగనన్న శ్మశానాలను కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేయాలి’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments