Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా... గుంటూరులో పెరుగుతున్న కేసులు

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (05:57 IST)
గుంటూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గుంటూరులో ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి కరోనా వైరస్‌ సోకింది.

ఢిల్లీ నుండి వచ్చిన ఒక వ్యక్తి వల్ల నగరంలోని పాతగుంటూరు కుమ్మరి బజార్‌కు చెందిన ఒక కుటుంబానికి కరోనా సోకిందని జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ చెప్పారు. ఆ కుటుంబానికి చెందిన 13 మంది ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.

వీరిలో ఇద్దరికి మినహా మిగిలిన వారందరికి కరోనా వ్యాపించింది. బాధితుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. వీరందరిని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు.

తాజా సంఘటనతో గుంటూరులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 75కు చేరింది. వీరిలో గుంటూరు నగరానికి చెందిన వారే 57 మంది ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 405కు చేరుకుంది. శనివారం ఒక్కరోజే 24 కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments