Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌ఎంపీలూ.. ఇలాగైతే శిక్ష తప్పదు: వైద్య శాఖ హెచ్చరిక

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (05:44 IST)
జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చే వారికి ఆర్‌ఎంపీలు వైద్యం చేయొద్దని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పిలు ఎప్పటికప్పుడు స్థానిక వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలన్నారు. 

జిల్లాల్లో ఆర్‌ఎంపీలు కరోనాకు సంబంధించిన వైద్యం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆదేశాలను పాటించకుంటే ఆర్‌ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ కేసులకు సంబంధించిన ఓపీలు మాత్రమే నడుస్తాయని జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ప్రత్యేక ఓపీని నడిపించాలన్నారు. "గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పిలు ఎప్పటికప్పుడు స్థానిక వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలి. దగ్గర్లో ఉండే ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సమాచారమివ్వాలి. ఉత్తర్వుల్ని ఉల్లంఘించే  ఆర్.ఎం.పిలపై చర్యలు తప్పవు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేసింది.  4 రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రులు అందుబాటులో వున్నాయి" అని జవహర్‌రెడ్డి  పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments