Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. ఉద్యోగాలు వదులుకుంటున్న మహిళా టీచర్లు

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (15:00 IST)
Teacher
కరోనా కారణంగా ఉద్యోగాలను వదులుకుంటున్నారు.. మహిళా టీచర్లు. కరోనా కారణంగా జీతాలివ్వరేమోననే అనుమానంతో మహిళా టీచర్లు ఉద్యోగాలు వదులుకుంటున్నారు. ఫలితంగా నూతన విద్యాసంవత్సరంలో పలు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తలెత్తనుంది.

కరోనా కారణంగా అనేక విద్యాసంస్థలను అర్ధాంతరంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో ఫీజులు వసూలు కాలేదని అనేక పాఠశాలలు మార్చి తర్వాతి నుంచి జీతాలిచ్చేది లేదనడంతో వందల మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఉద్యోగం మానేశారు. 
 
ఎక్కువ పని గంటల కారణంగా పనిభారంతో సతమతమవుతున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయులు కరోనా పరిస్థితుల్లో బోధన వృత్తిని వదిలి.. ఇతరత్రా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే రెండు నెలల వేతనం ఇవ్వకపోవడం.. వచ్చే ఏడాది ఆన్‌లైన్‌ పాఠాలు, షిఫ్టు విధానం తదితర కారణాల వల్ల మరింత పని భారం పెరుగుతుందనే కారణంగా మహిళా టీచర్లు ఉద్యోగాలను వదులుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వందలాది మంది టీచర్లు తమ వృత్తులను మార్చుకుంటున్నారని.. తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ ప్రేమ పాట

సినీ నటి అభినయకు నిశ్చితార్థం

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

తర్వాతి కథనం
Show comments