Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగులకు పసరు మందు : ఇటుకల వ్యాపారిపై బైండోవర్ కేసు

Webdunia
గురువారం, 27 మే 2021 (12:04 IST)
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఇటుకల వ్యాపారి కరోనా బాధితులు పసరు మందు పంపిణీ చేశారు. దీంతో ఆయనపై పోలీలుసు బైండోవర్ కేసును నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఏడుచుట్లకోట గ్రామానికి చెందిన ఇటుకల వ్యాపారి గోవిందరాజులు అనే వ్యక్తి కరోనా రోగులకు గత నాలుగు రోజులుగా ఉచితంగా ఓ పసరు మందు పంపిణీ చేస్తున్నారు. 
 
ఈ మందును సుమారుగా 400 మందివరకు తీసుకున్నారు. ఈ విషయం వైరల్ కావడంతో తహశీల్దార్‌ రవి ఆయన్ను పిలిపించి విచారించారు. తాను ఏడో తరగతి వరకే చదివానని, తమ కుటుంబానికి నాటుమందు ఇచ్చే నేపథ్యం ఉందని, ఆనందయ్య మందు గురించి తెలుసుకుని తానూ ఇస్తున్నట్లు గోవిందరాజులు వివరించారు. 
 
ఎలాంటి అర్హత లేకుండా నాటుమందు పంపిణీ చేస్తున్న ఆయనపై బైండోవర్‌ కేసు నమోదు చేసినట్లు తహశీల్దార్‌ తెలిపారు. మందు పంపిణీ చేసినవారిలో ఎవరికైనా ప్రాణాపాయం కలిగితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా అధికారులకు నివేదించినట్లు సీఐ ప్రసాదబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments