Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచారామ క్షేత్రంలో ధన్వంతరి, మహా మృత్యుంజయ హోమాలు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (15:25 IST)
కరోనా మహమ్మారి ఏపీని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. గత రెండుమూడు రోజులుగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ రాష్ట్రాన్ని హడలెత్తిస్తోంది. అన్ని జిల్లాల నుంచి రెండంకెల లెక్కల్లో వైరస్ కేసులు నమోదు కావడంతో అంతటా హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. దుకాణాలు, మార్కెట్లు అన్ని మూసివేయించారు. ప్రజలు ఇళ్లనుండి కాలు బయటపెట్టకుండా 144 సెక్షన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రం, సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. రాష్ట్రాన్ని కరోనా పట్టిపీడిస్తున్న నేపథ్యంలో దాని నివారణ కోసం, లోక శాంతి కోసం ఆలయ ఈవో పులి నారాయణ మూర్తి ఆధ్వర్యంలో అర్చక బృందం ధన్వంతరి హోమం, మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. 
 
భక్తులెవర్నీ లోనికి అనుమతించకుండా అర్చకులు, పండితులు ఈ హోమాలు జరిపారు. స్వామివారికి అర్చకులు రోజువారీ కైంకర్యాలు, పూజలు యధావిధిగా నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈఓ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments