Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ దుకాణం వ్యాపారికి కరోనా.. వణికిపోతున్న స్థానికులు ... ఎక్కడ?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (11:01 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ముఖ్యంగా, ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే సామాజికి భౌతికదూరం పాటించాలంటూ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ, చాలామంది వీరి విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా, ఆదివారాలు అయితే.... ప్రతి ఊర్లోనూ మాంసం కోసం జనాలు ఎగబడుతున్నారు. వారిలో ఏ ఒక్కరికైనా కరోనా వైరస్ ఉంటే... ఇక మిగిలినవారికి వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువ. ఇపుడు విశాఖపట్టణంలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. 
 
విశాఖపట్టణంలోని గాజువాక సెంటర్‌లో ఓ వ్యక్తి చికెన్ దుకారణం నడుపుతున్నాడు. వాస్తవానికి ఈయనలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంలో వైద్యాధికారులు గుర్తించి, హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కానీ, ఈ వ్యాపారి అవేమీ పట్టించుకోకుండా చికెన్ షాపును తెరిచాడు. ఈ విషయం తెలియని స్థానికులు ఈ దుకాణంలో మాసం కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన వారిలో కొందరికి వైరస్ లక్షణాలు కనిపించాయి. 
 
ఈ విషయం విశాఖ అధికారులు దృష్టికి వెళ్లడంతో వారు రంగంలోకి దిగి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చికెన్ దుకాణం వ్యాపారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా, ఈ వైరస్ లక్షణాలు కనిపించే పలువురి వద్ద శాంపిల్స్ సేకరించారు. ఇలాంటివారిని హోంక్వారంటైన్‌కు ఆదేశించారు. అయితే, స్థానికులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments