Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతపెద్ద ముసుగులో మోసాలు.. 1000 పెళ్లిళ్లు.. అందమైన అమ్మాయిల్ని షేక్‌లకు?

దాదాపు వెయ్యి పెళ్లిళ్లు చేసిన పాతబస్తీలో గ్రేటర్‌ చీఫ్‌ ఖాజీ రఫియా లీలలు వెలుగులోకి వచ్చాయి. మతపెద్ద ముసుగులో మోసాలు చేశాడు. డబ్బు కోసం రికార్డు స్థాయిలో 1000 కాంట్రాక్టు మ్యారేజీలు చేశాడు. అరబ్బు షే

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (09:45 IST)
దాదాపు వెయ్యి పెళ్లిళ్లు చేసిన పాతబస్తీలో గ్రేటర్‌ చీఫ్‌ ఖాజీ రఫియా లీలలు వెలుగులోకి వచ్చాయి. మతపెద్ద ముసుగులో మోసాలు చేశాడు. డబ్బు కోసం రికార్డు స్థాయిలో 1000 కాంట్రాక్టు మ్యారేజీలు చేశాడు. అరబ్బు షేకులెవరికైన కొత్త పెళ్లాం కావాలనిపిస్తే ఖాజీ రఫియాను సంప్రదిస్తారు.

అంతేవారు హైదరాబాదు ఎయిర్ పోర్టులో దిగింది మొదలు అన్నీ రఫియానే చక్కబెడతాడు. ఇందుకు తన ఏజెంట్లను నియమించుకున్నాడు. వారి పనేంటంటే... ముస్లిం బస్తీల్లో అందంగా ఉండే ముస్లిం యువతుల అడ్రస్ లు సంపాదించి, వారి తల్లిదండ్రులను ముగ్గులోకి లాగడమే. 
 
ఇలా పేద ముస్లింలను టార్గెట్ చేసేందుకు ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. ఇలా అందాల ఆశ చూపించి.. రూ.70వేలు చేతిలో పెట్టి  రూ.2,50,000లను ఏజెంట్లు తీసుకుంటారు. పెళ్లికి ఐదులక్షలు సుపారీ ఇస్తారు. ఇలా పేదరికాన్ని ఆసరాగా తీసుకుని వారిని వంచిస్తాడు. పెళ్లి కంటూ వచ్చే అరబ్ షేక్‌లు హైదరాబాదు వచ్చారంటే.. రోజుకి ఐదువేల రూపాయల అద్దెతో పాటు పెళ్లికి 5,00,000 రూపాయలు చెల్లించాల్సిందే. మిగతా కార్యక్రమాలన్నీ ఖాజీ రఫియా చూసుకుంటాడు. బాలిక తల్లిదండ్రులకు 70,000 రూపాయలు ఇస్తాడు. ఏజెంట్‌కు 2.50,000 రూపాయలు ఇస్తాడు. మిగిలింది ఖాజీ తన జేబులో వేసుకుంటాడు. 
 
ఇలా ఇతని వద్దకు వివాహానికి 25 మంది షేక్‌లు వచ్చేవారంటే రఫియా పనితనం ఏ రీతిలో ఉండేదో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా ఐదేళ్లలోనే వెయ్యి పెళ్లిళ్లు చేశాడంటే షాకవుతారు. ఇది కేవలం హైదరాబాదు పాతబస్తీకి మాత్రమే పరిమితం కాదని, ముంబైలో కూడా కార్యాలయం ఓపెన్ చేశాడని, అక్కడ తనిఖీలు నిర్వహించిన తరువాత ఇతగాడి అసలు రంగు బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments