Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్రపాలి వినూత్న ప్రయోగం: ''చిన్నారి డాక్టర్'' పేరుతో స్కూళ్లలో హెల్త్ క్లబ్‌లు

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా హనుమకొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలో హెల్త్ క్లబ్ ప్రారంభించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కోసం చిన్నారి డాక్టర్ పేరుతో ప్రభుత్వ స్క

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (13:15 IST)
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా హనుమకొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలో హెల్త్ క్లబ్ ప్రారంభించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కోసం చిన్నారి డాక్టర్ పేరుతో ప్రభుత్వ స్కూళ్లలో హెల్త్ క్లబ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హన్మకొండ లష్కర్ బజారులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో తోటి విద్యార్థులు డాక్టర్లుగా తమ స్నేహితుల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతారు. హన్మకొండలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో చిన్నారి డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు అర్బన్ జిల్లాలోని 500కి మించిన పాఠాశాలల్లో హెల్త్ క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రకారం ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థుల్లో తరగతికి ఇద్దరు చొప్పున విద్యార్థులను చిన్నారి డాక్టర్లుగా ఎంపిక చేసి.. వారికి వైద్యశాఖ ద్వారా శిక్షణ ఇప్పిస్తారు. 
 
అలా ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్ ‌కోడ్ వుంటుంది. చిన్నారులు ఎదుర్కొనే సమస్యలతో పాటు కౌమార దశలో వచ్చే సమస్యలతో పాటు విద్యార్థినుల్లో అవగాహన కల్పించేందుకు, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విద్యార్థినులకు మనోధైర్యం కల్పించే రీతితో ఈ కార్యక్రమం వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం