Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హాస్టల్‌లో సీనియర్లతో తలనొప్పి.. ఉరేసుకున్న విద్యార్థిని.. తమ్ముడిని బాగా చూసుకోండంటూ?

విద్యాభ్యాసం కోసం హాస్టల్‌లో చేరుతున్న విద్యార్థులు సరైన సదుపాయాలు లేక, సీనియర్ల ర్యాంగింగ్ వంటి ఇతరత్రా సమస్యలతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా హస్టల్లో ఉండటం ఇష్టం లేని ఓ విద్యార్థిని హాస్ట

హాస్టల్‌లో సీనియర్లతో తలనొప్పి.. ఉరేసుకున్న విద్యార్థిని.. తమ్ముడిని బాగా చూసుకోండంటూ?
, మంగళవారం, 29 ఆగస్టు 2017 (09:15 IST)
విద్యాభ్యాసం కోసం హాస్టల్‌లో చేరుతున్న విద్యార్థులు సరైన సదుపాయాలు లేక, సీనియర్ల ర్యాంగింగ్ వంటి ఇతరత్రా సమస్యలతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా హస్టల్లో ఉండటం ఇష్టం లేని ఓ విద్యార్థిని హాస్టల్‌ గదిలో ఉరేసుకుంది.

ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్‌ గ్రామ పంచాయతీ రత్నపురి వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి గ్రామానికి చెందిన అనకాపల్లి రాజశేఖర్, అరవింద దంపతుల కుమార్తె సహస్ర (17)ను రత్నపురి పాలిటెక్నిక్‌ కళాశాలలో సెకండియర్‌ చదువుతోంది. 
 
కొద్ది నెలల నుంచి కళాశాలలో సీనియర్‌ విద్యార్థినులు ఇబ్బందులు పెడుతున్నారని సహస్ర తండ్రి రాజశేఖర్‌కు చెప్పింది. దీంతో 15 రోజుల క్రితం రాజశేఖర్‌ కళాశాల ఏఓ భిక్షపతితో మాట్లాడారు. హాస్టల్‌లో మహిళా వార్డెన్‌ లేకపోవడంతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో విద్యార్థి సహస్ర ఆదివారం అర్థరాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
సూసైడ్‌లో కాలేజీ నచ్చలేదని.. స్నేహితులు లేరని.. కాలేజీ నుంచి బయటికి వెళ్తే అవకాశం కూడా లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆత్మహత్య చేసుకుంటానని తనను క్షమించాల్సిందిగా తల్లిదండ్రులను కోరిన సహస్ర.. తమ్ముడిని బాగా చూసుకోండి.. వాడిని మాత్రం హాస్టల్‌లో చేర్చొద్దని సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అణ్వస్త్ర పరీక్షకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా: సెప్టెంబర్ 9న ముహూర్తం