Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముకేష్ అంబానీకి సీఎం జగన్ కృతజ్ఞతలు.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 26 మే 2021 (10:25 IST)
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ఏపీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పంపడం ద్వారా విశేషంగా సహకరించారంటూ ముకేష్ అంబానీతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ పై పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు సాయపడుతున్నారంటూ కొనియాడారు. ఈ మేరకు సీఎం జగన్ ట్విట్ చేశారు.
 
రాష్ట్రానికి మీ మద్దతు ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. ఏపీలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో ఆక్సిజన్ కు డిమాండ్ కూడా తీవ్రస్థాయిలో ఉంది. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏపీ ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ రైళ్లు ఏపీకి రావడం ఊరట కలిగించే విషయం.
 
కష్టకాలంలో రాష్ట్రానికి సాయం చేసినందుకు టాటా స్టీల్ లిమిటెడ్ కు కూడా సీఎం జగన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. టాటా స్టీల్ ఏపీకి వెయ్యి లిక్విడ్ ఆక్సిజన్ సప్లయ్ చేసింది. కోవిడ్ పై పోరాటంలో ఇది చాలా గొప్ప సాయం అన్నారు. అలాగే ఎంపీ నవీన్ జిందాల్ కి సైతం సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. జేఎస్పీఎల్ రాష్ట్రానికి 500 ఎంటీ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments