Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీతో భేటీ... చిరుగుల ఫ్యాంట్‌తో ఉపాసన!

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (10:55 IST)
క‌లిసింది దేశాధినేత‌ను, క‌లిసిన‌వారు కోటీశ్వ‌రురాలు... కానీ, ఆమె వేసిన చిరుగుల ఫ్యాంట్... స‌వ్యంగా లేని బ‌ట్ట‌ల‌ను చూసి, ఔరా అని జ‌నం ముక్కున వేలేసుకుంటున్నారు.
 
సినీ హీరో, మెగాస్టార్ కుమారుడు రాంచరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అందులో దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటోను ఆమె షేర్ చేశారు. అయితే, ఈ ఫోటోలో ఉపాసన ధరించిన దుస్తులు హుందాగా లేకపోగా, ఆమె స్థాయికి ఏ మాత్రం త‌గ‌నివి. బాగా చిరుగులతో ఉన్న జీన్స్ ను ఆమె ధరించిన వైనాన్ని నెట్ జ‌నులు తప్పు పడుతున్నారు. 
 
 
దేశ ప్రధానిని కలిసే సందర్భంలో ధరించే దుస్తులు హుందాగా ఉండాలే కానీ, ఇలా మ‌రీ ఫ్యాషన్ బుల్ గా ఉండాల్సిన అవసరం ఏముందంటున్నారు. ఒకవేళ ఇలాంటి దుస్తులు ధరించాలంటే మెగా ఫ్యామిలీలో జరిగే వేడుకల సందర్భంగా ధరిస్తే బాగుంటుంది కదా? అన్న అభిప్రాయం ప‌డుతున్నారు. గౌరవనీయ స్థానాల్లోని వారిని ఒక సంస్థ నుంచి ప్రాతినిధ్యం వహించేటప్పుడు హుందాతనాన్ని ప్రతిబింబించేలా వస్త్రధారణ అయితే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
 
 
ఇంతకీ ఆమె ప్రధాని మోడీని ఎందుకు కలిశారు? అంటే ఇండియన్ ఎక్స్పో- 2020లో భాగంగా ఈ సమావేశం జరిగినట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్ పో 2020లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నాను. ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగుపర్చటం, మహిళా సాధికారత,  కల్చర్ పరిరక్షణ మీద దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలు. సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాల్ని ఇస్తుందన్నారు. సాంకేతికతను మనం తెలివిగా, సమర్థంగా ఉపయోగించుకోవాలని పోస్టులో పేర్కొన్న ఉపాసన, సంస్కృతి పరిరక్షణ అని చెబుతున్న ఉపాసన మాటలకు చేతలకు సంబంధమే లేదంటున్నారు. ప్రాశ్చాత్య భావజాలానికి ప్రతీకలైన మోకాళ్ల దగ్గర చిరిగిన ర్యాప్ జీన్స్ ను వేసుకోవటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. 
 
 
ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా ఇలాంటి వస్త్రధారణ సరికాదంటున్నారు. చెప్పే మాటలకు ఏ మాత్రం సింక్ కాని రీతిలో ఉన్న ఆమె ఫోటోతో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ ప్రధానిని కలిసే వేళ.. మరింత హుందాగా ఉండే దుస్తులు ధరించి ఉంటే బాగుండేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments