Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులూ కరోనా భయం వ‌ద్దు: అందుబాటులోకి 1800 – 121 - 2830 టోల్ ఫ్రీ నెంబర్

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (23:28 IST)
చిన్నారులను కరోనా మహమ్మారి భయాందోళనల నుండి కాపాడే క్రమంలో జాతీయ బాలల హక్కుల కమీషన్ విభిన్న కార్యక్రమాలను చేపడుతుందని బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు,  వీధి బాలలు, మహిళాభివృధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

కరోనా బారిన పడుతున్న చిన్నారులు, వారి ఇబ్బందులను ఎదుర్కొనేలా తగిన భరోసాను కల్పిస్తూ జాతీయ బాలల హక్కుల కమీషన్ 1800 – 121 - 2830 పేరిట ఉచిత చరవాణి సంఖ్యను (టోల్ ఫ్రీ నెంబర్) అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. కరోనా బారినపడి మానసికంగా, శారీరకంగా బాధపడుతున్న వారు తమ ఆంధోళనల నుండి విముక్తి పొందేందుకు ఈ ఉచిత చరవాణి సంఖ్యను సద్వినియోగం చేసుకోవచ్చని కృతికా శుక్లా వివరించారు.

ఈ చరవాణి సంఖ్యలో నిపుణులైన కౌన్సిలర్లు, మానసికతత్వ శాస్త్ర నిపుణులు అందుబాటులో ఉంటారని, కరోనా పరిస్దితుల నేపధ్యంలో ఆందోళనలో ఉన్న చిన్నారులకు ప్రాధమికమైన మానసిక ధైర్యం అందించేందుకు సహకరిస్తారని పేర్కొన్నారు.

వారిని కరోనా ఆలోచనల నుండి దూరం చేసి సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన సలహాలను ఇస్తారన్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వీరు ఉచిత చరవాణి సంఖ్యలో సిద్దంగా ఉంటారన్నారు.

పూర్తి స్ధాయి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ జాతీయ బాలల హక్కుల కమీషన్ ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ సైన్స్, న్యూరో సైన్సెస్ సహకారంతో చిన్నారుల ప్రయోజనం కోసం నిర్వహిస్తున్నారని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. చిన్నారులు, వారి తల్లి దండ్రులు ఈ ఉచిత చరవాణి సంఖ్యను చేరుకోవటం ద్వారా ప్రయోజనం పొందాలని కృతికా శుక్లా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments