దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ వైరస్ అందరికీ సోకుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా..కొంత మంది మృతి చెందారు. తాజాగా ఈ వైరస్ కు మరో ఒడిశా ఎమ్మెల్యే బలయ్యాడు.
వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రదీప్ మహారథి కరోనాతో కన్నుముశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన...ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఒడిశాలోని పిపిలి నియోజకవర్గం నుంచి 1985లో ప్రదీప్ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
అప్పటి నుంచి 2019 వరకు వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. నవీన్ పట్నాయక్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ప్రదీప్ పనిచేశారు. ప్రదీప్ మృతి పట్ల సీఎం నవీన్ పట్నాయక్, పార్టీ నేతలు సంతాపం తెలిపి...కుటుంబ సభ్యులను పరామర్శించారు.