Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా నివారణ చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలి: పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి

కరోనా నివారణ చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలి: పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి
, శనివారం, 10 అక్టోబరు 2020 (23:12 IST)
కోవిడ్ – 19 ప్రతిజ్ఞ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు కరోనా మహామ్మారి  రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. శనివారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ – 19 ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో భాగంగా  ‘‘కోవిడ్ – 19 వ్యాధి గురించి ఎల్లవేళలా పూర్తి అప్రమత్తతో ఉంటూ నాకు మరియు నా సహచరులకు వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను. కోవిడ్ -19 వ్యాధి వ్యాప్తి అరికట్టడం కోసం  అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు నేను పాటిస్తూ ఇతరులచేత పాటింప చేస్తాను. 

నేను ఎల్లప్పుడు ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాలలో ముఖానికి మాస్కులు ధరిస్తాను.  ఇతరుల నుండి  కనీసం ఆరు అడుగుల దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటాను. నేను తరచూ చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకుంటాను. నేను ఈ నియమాలు పాటిస్తూ అందరి చేత పాటింపజేస్తూ కలిసికట్టుగా కోవిడ్ -19 పై విజయం సాధిస్తానని ప్రతిజ్ఞ చేయిచున్నాను’’ అని  సిబ్బందితో పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్  కోవిడ్ – 19 ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, ఎఎస్పీడీ ఆర్.మధుసూదనరెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవన్నీ అసత్య ప్రచారాలు: మంత్రి ఆదిమూలపు సురేష్