జనం పైకి ఉరికిన చిరుతపులి... చూడండి వీడియో...

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (19:08 IST)
వ్యవసాయ పొలాల వద్ద ప్రత్యక్షమైన చిరుతను చూసేందుకొచ్చిన జనంపై ఒక్కసారిగా చిరుత దాడి చేయడంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం వాణీయంబాడీ సమీపంలోని చిక్కనాకుప్పం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద చోటుచేసుకుంది. వాణీయంబాడీ సమీపంలోని చిక్కనాకుప్పం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద గురువారం ఉందయం చిరుత ప్రత్యక్షమైంది. 
 
దీనితో చిరుతను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే 2 గంటల ప్రాంతంలో ఇక్కసారిగా చిరుత జనంపైకి రావడంతో భయంతో పరుగులు తీశారు. పరుగులు తీస్తున్న వారిపై చిరుత దాడి చేసి గాయపరచింది. చిరుత దాడిలో అలివేలు, కమల్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను వాణీయంబాడీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు 20 మంది సిబ్బందిని నియమించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అది మాత్రం ఇంతవరకూ జాడ లేకుండా పోయింది. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments