Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లోపతి, ఆయూష్‌తో కరోనాకు చెక్

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (07:38 IST)
అల్లోపతి, ఆయూష్‌ల సమన్వయంతో కరోనా వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయూష్‌ కమిషనరు పి.ఉషారాణి చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ ఆర్ట్స్‌ కాలేజీ ఆడిటోరియంలో ఆయూష్‌ కళాశాల వైద్యులకు నిర్వహించిన పోస్ట్‌ కరోనా మేనేజ్‌మెంట్‌ శిక్షణను ఆమె ప్రారంభించారు.

ఉషారాణి మాట్లాడుతూ కరోనా రోగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పాటించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 400మంది ఆయూష్‌ వైద్యులు అందించిన ముందస్తు చికిత్సా విధానాలు మంచి ఫలితాలిచ్చాయని చెప్పారు. మారుమూల గ్రామాల్లో 2లక్షల మందికి కరోనా నివారణ కోసం ఆయుర్వేద మందులను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

గుడివాడ ప్రాంతంలో చేపట్టిన ప్రయోగాత్మక చర్యల్లో భాగంగా ఉచిత కరోనా మందులు వాడిన వారికి వ్యాధి సోకలేదని నిర్ధారణైందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందిన శాస్త్రీయ విధానాలపై ఆయుర్వేద వైద్యులకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్రంలో 25 ఆయూస్‌ స్పెషాలిటీ కేంద్రాల ద్వారా కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సాధారణ చికిత్సల్లో భాగంగా చంటిబిడ్డలకు సోకే డయేరియా, ఊపిరితిత్తుల వ్యాధులకు చికిత్స అందించనున్నామని, భవిష్యత్తులో తల్లిపాలు పెంచేందుకు గర్భవతులకు, బాలింతలకు ఆయూష్‌ మందులు ఉచితంగా అందించనున్నామని పేర్కొన్నారు.

శిక్షణ కార్యక్రమంలో ఆయూష్‌ శాఖ అడిషినల్‌ డైరెక్టరు డాక్టర్‌ సాంబమూర్తి, రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్లు డాక్టర్‌ కేవీ రమణ, డాక్టర్‌ శేఖర్‌, ఆయూష్‌ వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సాయిసుధాకర్‌, ఫిజియోథెరపీ వైద్యనిపుణులు డాక్టర్‌ వోలాస్‌, కరోనా వైద్యనిపుణులు డాక్టర్‌ శిరీషా, ఆయూష్‌ కళాశాలల వైద్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments