Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు హైదరాబాద్ విజన్ కంప్లీట్, ఇక అమరావతిపైన టార్గెట్: నాగబాబు

ఐవీఆర్
శనివారం, 19 అక్టోబరు 2024 (18:17 IST)
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓ విజన్ వున్నటువంటి సీఎం అనీ, హైదరాబాదు విషయంలో ఆయన అనుకున్నది కంప్లీట్ చేసారని జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... ''చంద్రబాబు నాయుడిని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎన్టీఆర్ గారికి నష్టం చేసి అయ్యాడని అంటారు కానీ పూర్వాపరాలు ఏంటని ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు.
 
కానీ హైదరాబాద్ నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలన్న విజన్ తో వున్న సీఎం చంద్రబాబు. దాన్ని సాకారం చేసారాయన. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో కూడా చంద్రబాబు గారికి ఓ విజన్ వుంది. కానీ మధ్యలో వైసిపి వచ్చి దాన్ని సర్వనాశనం చేసింది. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక అమరావతి రాజధాని సాకారం జరిగి తీరుతుంది.
 
చంద్రబాబు నాయుడుకి వున్న ఓర్పు, సహనం ఎంతో వుంది. ఎవరెన్ని మాటలు అన్నప్పటికీ ఓర్పుతో ముందుకు సాగుతారు. ఇప్పుడు చంద్రబాబు-పవన్ కల్యాణ్ గారు ఏదైతే ప్రామిస్ చేసారో అవి వచ్చి తీరుతాయి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నీతిజ్ఞుడు. రాష్ట్ర సమస్యల పట్ల చంద్రబాబు నాయుడు గారికి వున్న అవగాహన మరెవ్వరికీ లేదు'' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments