Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు- పవన్ చెరో రెండు స్థానాల్లో పోటీ

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (11:38 IST)
వైసీపీలోనే కాదు టీడీపీలోనూ సీట్ల మార్పు కసరత్తు మొదలైంది. ఇప్పట్లో టీడీపీకి ఎప్పుడో మారిన ఈ ఎన్నికల్లో టీడీపీ..జనసేన ప్రధాన నేతలు పోటీ చేసే స్థానాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ చెరో రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు. లోకేష్, నందమూరి బాలయ్య పోటీ చేసే స్థానాల్లో మార్పు కనిపిస్తోంది.
 
వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే చంద్రబాబు-పవన్ లక్ష్యం. ఇందులో భాగంగానే ఎన్నికల వ్యూహాలపై చంద్రబాబు ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్, బాలయ్య పోటీ చేసే సీట్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు పోటీ చేస్తున్న కుంపంతో పాటు ఉత్తరాంధ్రలోని మరో స్థానం నుంచి కూడా చంద్రబాబు పోటీ చేయాలని పీకే సూచించినట్లు తెలుస్తోంది.
 
దీంతో చంద్రబాబు భీమిలి వైపు చూస్తున్నట్లు సమాచారం. దీంతో ఉత్తరాంధ్రలో పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా భీమవరంతో పాటు తిరుపతి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గోదావరితో పాటు రాయలసీమ జిల్లాల్లో పవన్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.
 
తాజాగా నారా లోకేష్‌పై బీసీ వర్గానికి చెందిన నేతను రంగంలోకి దించాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో అక్కడ లోకేష్ పోటీ చేయకుండా బీసీ వర్గం నుంచి బరిలోకి దిగాలని పీకే సూచించినట్లు సమాచారం. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి లోకేష్ పోటీ చేయాలని భావిస్తున్నారు.
 
దీని ద్వారా రాయలసీమ జిల్లాల నుంచి లోకేష్ - పవన్ ప్రాతినిధ్యం వహించేందుకు కొత్త స్కెచ్ సిద్ధమవుతోంది. మరి.. నందమూరి బాలయ్యను గుడివాడ లేదా ఉండి నుంచి పోటీ చేయించాలని.. దీని ద్వారా గోదావరి జిల్లాల్లో పవన్ – బాలయ్య కాంబినేషన్ పార్టీకి కలిసొస్తుందని లెక్కలు వేసుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments