Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

ఏపీ ఎన్నికల్లో బిగ్ బాస్ శివన్న.. టీడీపీ-జనసేన పొత్తులో..

Advertiesment
sivaji
, బుధవారం, 27 డిశెంబరు 2023 (21:40 IST)
మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. అంతే కాకుండా అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలు దృష్టి సారించారు. ఇలాంటి సమయంలో జనసేన, టీడీపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అతను మరెవరో కాదు, హీరోగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచిన శివాజీ.
 
గత ఎన్నికల్లో టీడీపీ తరపున పనిచేసిన శివాజీ 2014 ఫలితాల తర్వాత కనుమరుగయ్యారు. హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శివాజీ.. పొలిటికల్ టర్న్ తీసుకుని మరీ నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. 
 
బిగ్ బాస్-7లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరి ఇంట్లో శివన్నగా మారిపోయాడు. అయితే.. శివాజీ బిగ్‌బాస్‌లోకి రావడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పుడు అది నిజమే కావచ్చునని సమాచారం. 
 
బిగ్ బాస్ ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా నరసరావుపేట, వినుకొండ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ బ్రాండ్ పేరుతో రూ.25లకే కిలో బియ్యం