Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీలో చేరనున్న వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

jyothula chantibabu
, సోమవారం, 25 డిశెంబరు 2023 (15:38 IST)
ఏపీలో అధికార వైకాపా గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాటు పార్టీ మారనున్నారు. వైకాపా‌కు రాజీనామా చేసి... చంద్రబాబు చెంతకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెల 5 లేదా 6 తేదీల్లో టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఇదేవిషయంపై ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైకాపా టిక్కెట్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అయితే, జగ్గంపేట టిక్కెట్ ఇవ్వలేమని టీడీపీ పెద్దలు ఆయనకు తేల్చి చెప్పారు. దీంతో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వాలని టీడీపీ నేతలను కోరినట్టు సమాచారం. 
 
2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన జ్యోతుల చంటిబాబు ఓడిపోయారు. కానీ, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయనను ఏలేరు ప్రాజెక్టు చైర్మన్‌గా చంద్రబాబు నియమించారు. అయితే, వైకాపా నుంచి టీడీపీలోకి జ్యోతు నెహ్రూ రావడంతో ఆయన వైకాపాలో చేరారు. 2019లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేమని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో తిరిగి సొంతగూటికి వచ్చేందుకు చంటిబాబు దాదాపుగా నిర్ణయించుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం