Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'యువగళం - నవశకం' వేదిక వద్దకు చేరికను చంద్రబాబు - బాలకృష్టి

chandrababu
, బుధవారం, 20 డిశెంబరు 2023 (15:29 IST)
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా బుధవారం సాయంత్రం 'యువగళం - నవశకం' పేరిట భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సభలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విశాఖకు చేరుకున్నారు. వారికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
 
ఈ సభ కోసం పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకునేలా వివిధ మార్గాలను నిర్దేశించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ఒకే బహిరంగ వేదికపై కలిసి కనిపించనున్నారు. 
 
డీఎంకే నేతకు షాకిచ్చిన బీహార్ సీఎం నితీశ్ - హిందీ తెలిసి ఉండాల్సిందే... 
 
డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ తేరుకోలేని షాకిచ్చారు. ఢిల్లీలో మంగళవారం ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఇందులో నితీశ్ కుమార్ ప్రసంగించారు. ఈ ప్రసంగం అర్థంకాకపోవడంతో అనువాదం చేయాలని పక్కనే ఉన్న ఆర్జేడీ ఎంపీని టీఆర్ బాలు కోరారు. దీన్ని చూసిన నితీశ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ భాష హిందీ అందరికీ తెలిసివుండాల్సిందేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.
 
ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో పాటు ఇతర పార్టీల నేతలంతా పాల్గొన్నారు. ఇందులో నితీశ్ హిందీ ప్రసంగం అర్థం కాకపోవడంతో ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ కే ఝా వైపు చూస్తూ నితీశ్ స్పీచ్‌ను అనువాదం చేయగలరా? అని అడిగారు. 
 
దీంతో ఆయన నితీశ్ అనుమతి కోరారు. దీనికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ "మనం మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తాం. హిందీ మన జాతీయ భాష. మనకు ఆ భాష తెలిసివుండాలి అని పేర్కొన్నారు. అంతేకాదు, తన ప్రసంగాన్ని అనువదించవద్దని మనోజ్‌ను సీఎం నితీశ్ కుమార్ కోరారు. దీంతో టీఆర్ బాలు చిన్నబుచ్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విదేశాల్లో చదవాలనుకునే ఏపీ పేద విద్యార్థులకు గుడ్ న్యూస్