Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యూహంలోని చంద్రబాబు, పవన్ కల్యాణ్ రియల్ లైఫ్‌కు సంబంధం లేదు: రామ్ గోపాల్ వర్మ

Dasari Kiran Kumar, Ram Gopal Varma
, శుక్రవారం, 15 డిశెంబరు 2023 (16:55 IST)
Dasari Kiran Kumar, Ram Gopal Varma
అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే తన "వ్యూహం" సినిమా రిలీజ్‌ను కూడా ఎవరూ అడ్డుకోలేరని గతంలోనే చెప్పానని గుర్తుచేశారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ఆర్జీవీ "వ్యూహం" సినిమాను రూపొందించారు. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు.

ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. సెన్సార్ అడ్డంకులు దాటుకున్న వ్యూహం సినిమా క్లీన్ యూ సర్టిఫికెట్‌తో ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇవాళ వ్యూహం సినిమా ట్రైలర్ 2 ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, సెన్సార్ అడ్డంకులతో మా వ్యూహం సినిమా ఆగిపోయినప్పుడే చెప్పాను. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే.. మా సినిమా థియేటర్స్ లోకి రావడాన్నీ అడ్డుకోలేరని. ఇవాళ అదే జరిగింది. అందుకే ఫస్ట్ టైమ్ సెన్సార్ సర్టిఫికెట్ తో పోస్టర్ డిజైన్ చేయించాం.

ఈ నెల 29న గ్రాండ్ గా వ్యూహం సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఇందులో రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పాత్రలను పోలిన క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే వాటికి చంద్రబాబు, పవన్ రియల్ లైఫ్‌కు సంబంధం లేదు. ఈ వ్యూహం కథలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుండి మొదలై జగన్ అరెస్ట్, ఆయన పార్టీ పెట్టి సీఎం అవడం, వైఎస్ వివేక హత్య వంటి అనేక  ముఖ్య సంఘటనలు ఉంటాయి. సినిమా అంటే డ్రామా కాబట్టి ఆ ఘటనలన్నీ డ్రమటిక్‌గా సినిమా చూసే ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాను.

సలార్‌తో మా సినిమాకు పోటీ ఉండదు. రెండు వేర్వేరు జానర్ మూవీస్. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు సెపరేట్‌గా ఉంటారు. ఈ కథలోని అంశాలు ప్రజలందరికీ తెలిసిన విషయాలు కావు. ఇన్ సైడ్ జరిగిన విషయాలు. అలాంటి అంశాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. పవన్ కల్యాణ్ జనసేన పెట్టినప్పుడు ప్రసంగం విన్నాను. ఆ తర్వాత పవన్ స్టెప్స్ చూస్తే... ఆయన రాజకీయ ప్రయాణంలో స్థిరత్వం లేదనిపించింది. ఏ విషయాన్నైనా ఎవరికి వారు వారి కోణంలో అర్థం చేసుకుంటారు. వ్యూహం నాకు అర్థమైన కోణంలో రూపొందించిన సినిమా. వ్యూహంలో మీకున్న డౌట్స్ నా రాబోయో మూవీ శపథం చూస్తే క్లియర్ అవుతాయి.

నేను రాజకీయాల్లో లేకున్నా ఆ పొజిషన్స్‌లో ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తారు అనే ఐడియా ఉంది.  తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి డైనమిక్‌గా వ్యవహరించారు. ఆయన ఒక స్ట్రాంగ్ అపోజిషన్‌గా నిలబడటం వల్లే ఇవాళ కాంగ్రెస్ గెలిచింది. ఏపీలో తెలంగాణలో ఉన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ పాత్రను చంద్రబాబు పోషించలేకపోతున్నారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా నేను చేసినన్ని వెరైటీ మూవీస్ మరొకరు చేసి ఉండరు. వాటిలో బయోపిక్స్ ఐదారు వరకు ఉంటాయి. పాపులర్ పర్సన్ మీద సినిమా చేసినప్పుడు మీడియా అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని అన్నారు.
 
నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ - దేవుడు కొందరి చేత కొన్ని పనులను లోక కల్యాణం కోసం చేయిస్తుంటాడు. అలా నాతో ఈ సినిమా చేయించాడు అని భావిస్తున్నా. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని ఎవరూ డబ్బుతో కొనలేరు అనేది నా అభిప్రాయం. ఆర్జీవీకి వెలకట్టలేని వ్యక్తిత్వం ఉంది. ప్యాకేజీలకు అతీతమైన వ్యక్తి ఆయన. వంగవీటి తర్వాత నేను వర్మ గారితో చేస్తున్న సినిమా ఇది. మా మధ్య కోఆర్డినేషన్ బాగుండేది. కలిసి సినిమా చేయాలని అనుకున్నాం. అలా వ్యూహం, శపథం ప్రాజెక్ట్స్ మొదలయ్యాయి. ప్రతివారం థియేటర్స్ లోకి మూడు నాలుగు సినిమాలు రావడం సహజమే. మా వ్యూహం సినిమాకు కూడా ఎక్కువ సంఖ్యలోనే థియేటర్స్‌లో రిలీజ్ చేస్తాం. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బబుల్‌గమ్‌ ట్రైలర్ లో సూపర్ హిట్ కళ కనిపిస్తోంది: కే రాఘవేంద్రరావు