Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా టిక్కెట్‌ను అమ్ముకున్నారు : మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

mekapati chandrasekhar rddy
, శుక్రవారం, 15 డిశెంబరు 2023 (19:56 IST)
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తన టిక్కెట్‌ను అమ్ముకున్నారంటూ ఆయన ఆరోపించారు. ఆయన్ను కలవాలంటే బ్రహ్మ దేవుణ్ణి కలిసినంత అంటే ఇక పరిస్థితి ఎట్లుంటందో కథ అని చెప్పారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు శుక్రవారం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. 
 
వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు టీడీపీ చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. 
 
ప్రయాణ టిక్కెట్ - పాస్ పోర్టు - వీసా లేకుండా దేశాలు దాటేశాడు.. ఎలా? 
 
రష్యా పౌరుడు ఒకడు ఎలాంటి ప్రయాణ టిక్కెట్, వీసా, పాస్‌పోర్టు, బోర్డింగ్ ఇలాంటివి ఏవీ లేకుండా ఏకంగా దేశాల సరిహద్దులను దాటేశాడు. చివరకు విమానాశ్రయ భద్రతా సిబ్బంది చిక్కాడు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా ఎలా వచ్చావని అడిగితే తనకు ఏమీ గుర్తు లేదని చెప్పి షాకిచ్చాడు. అయితే, ఈ ఘటన గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రష్యాకు చెందిన సెర్గెయ్ వ్లాదిమిరోవిచ్ ఒచిగవా అనే వ్యక్తి ఇజ్రాయెల్ దేశంలో స్థిరపడ్డారు. నవంబర్ నాలుగో తేదీన ఆయన డెన్మార్క్‌లోని కోపెన్ హాగెన్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాలోని లాస్ఏంజిలిస్‌కు ప్రయాణించారు. అయితే, ఈ ప్రయాణానికి సంబంధించి ఆయన ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకోలేదు. పాస్‌పోర్ట్ వెంట తీసుకెళ్లలేదు, టికెట్ కొనలేదు, వీసా కూడా లేదు.. అంతెందుకు విమానంలోకి ఎంటర్ కావడానికి తప్పనిసరి అయిన బోర్డింగ్ పాస్ కూడా ఒచిగవా దగ్గర లేదు. అయినా విమానం ఎక్కి దేశాలు దాటి ప్రయాణించాడు.
 
ఎలాంటి పత్రాలు లేకుండా విమానం దిగిన ఒచిగవాను చూసి లాస్ఏంజిలిస్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇతర విమానాలలో వచ్చాడేమోనని మిగతా ప్రయాణికుల వివరాలను పరిశీలించారు. ఆ రోజు వచ్చిన విమానాలే కాదు అంతకుముందు రెండు మూడు రోజుల ప్రయాణికుల జాబితాలోనూ ఒచిగవా పేరులేదు. దీంతో ఇదెలా సాధ్యమైందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 
 
ఒచిగవాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మూడు రోజులుగా తనకు నిద్రలేదని, అసలు విమానం ఎలా ఎక్కానో కూడా తనకు గుర్తులేదని చెప్పాడు. ప్రయాణం మధ్యలో ఒచిగవా పలుమార్లు సీట్లు మారాడని, భోజనం కోసం ఒకటికి రెండుసార్లు రిక్వెస్ట్ చేశాడని ఫ్లైట్ అటెండెంట్స్ చెప్పారు. ఒచిగవా కాస్త అశాంతిగా కనిపించాడని విచారణలో వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై అమెరికా నేర పరిశోధనా సంస్థ ఎఫ్‌బీఐ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బర్రెలక్కపై జగన్ కామెంట్లు.. జనసేన సూపర్ కౌంటర్