Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనలా చేయడం వల్లనే పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్... వైసీపి వాళ్లకు అర్థం కాదిది: బాబు

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (20:32 IST)
అమరావతి రాజధాని అంశంపై వైసీపి నాయకులు చేస్తున్న భిన్న ప్రకటనలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా దీనిపై మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు.
 
''సమాజం కోసం చేసిన కృషి ఎప్పుడూ ఫలిస్తుంది. అందుకు ఆనాడు హైదరాబాద్‌లో చేసిన అభివృద్దే నిదర్శనం. పుల్లెల గోపీచంద్‌కు అప్పట్లో గచ్చిబౌలిలో 5 ఎకరాలు ఆకాడమీ కోసం ఇచ్చాం. ఇప్పుడు అక్కడ క్రీడా మాణిక్యాలు తయారవుతున్నాయి. పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ అయి తెలుగువారికి గర్వకారణంగా నిలిచింది.
 
తెలుగు ప్రజలకు ఒక శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతికి శ్రీకారం చుట్టాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రూపొందించాం. వైసీపీ వాళ్ళకు ఇవన్నీ అర్థం చేసుకునేంత పరిజ్ఞానం లేదు. చెబితే వినేంత విజ్ఞతా లేదు. ఒక్క అవకాశం అంటూ వచ్చి అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేసారు.
 
కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచి వచ్చిన తెతెదేపా కార్యకర్తలు, నాయకులతో ఈ రోజు సమావేశమయ్యాను. తెలంగాణలో నాయకులు వెళ్ళినా కార్యకర్తలెవరూ పార్టీని వీడలేదు. వారి నుంచే మళ్ళీ నాయకులను తయారుచేసి తెలంగాణాలో తెదేపా పుంజుకునేలా చేస్తా. ఏపీ, తెలంగాణలో తెదేపా శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరం'' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments