Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోవాలంటా ఒత్తిడి తెచ్చిన చాందినీ... చంపేసిన ప్రియుడు...

హైదరాబాద్ న‌గ‌రంలో సంచ‌ల‌నం సృష్టించిన చాందినీ జైన్ హ‌త్య కేసులోని మిస్టరీని ఎట్ట‌కేల‌కు పోలీసులు ఛేదించారు. చాందినీ జైన్‌ను త‌న ప్రియుడు సాయి కిర‌ణ్ హ‌త్య చేసిన‌ట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో స

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (10:17 IST)
హైదరాబాద్ న‌గ‌రంలో సంచ‌ల‌నం సృష్టించిన చాందినీ జైన్ హ‌త్య కేసులోని మిస్టరీని ఎట్ట‌కేల‌కు పోలీసులు ఛేదించారు. చాందినీ జైన్‌ను త‌న ప్రియుడు సాయి కిర‌ణ్ హ‌త్య చేసిన‌ట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో సాయి కిర‌ణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 
 
న‌గ‌రంలోని మదీనాగూడలో అదృశ్యమైన చాందినీ జైన్ మూడు రోజుల తర్వాత అమీన్‌పూర్ గుట్టలో శవమై కనిపించిన విషయం తెల్సిందే. ఈ హత్య వెలుగులోకి రావడంతో ఓ సంచలనంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులోని మిస్టరీని ఛేదించారు. 
 
సాయి కిరణ్ అనే యువకుడిని చాందనీ జైన్ ప్రేమించింది. సాయి కూడా మ‌దీనా గూడ‌లోని అపార్ట్‌మెంట్‌లో నివాస‌ముంటున్నాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని సాయి కిర‌ణ్‌పై చాందినీ ఒత్తిడి తెస్తుండ‌టంతోనే త‌న‌ను హ‌త్య చేసిన‌ట్లు సాయి కిర‌ణ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
 
ముందుగా రూపొందించుకున్న ప‌థ‌కం ప్ర‌కార‌మే చాందినీని అమీన్‌పూర్‌లోని గుట్ట‌ల్లోకి తీసుకెళ్లి హ‌త్య చేసిన‌ట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో చాందినీ డెత్ మిస్ట‌రీ వీడింది. అయితే, హ‌త్యకు ముందు చాందినీపై లైంగిక దాడి జ‌ర‌గ‌లేద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. మరిన్ని విషయాల కోసం సాయి కిరణ్ వద్ద విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం