Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం అడ్జంకి కాదు?: జేడీ

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (18:56 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఏపీ సహా మరే ఇతర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అంగీకరించవని కేంద్రం గతంలో పలుమార్లు చెప్పడం తెలిసిందే. 
 
అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణాలేంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు హోదా ఇచ్చేందుకు సాధ్యమైనప్పుడు.. ఏపీకి ఎందుకు కుదరదో చెప్పాలని కోర్టు పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సర్కారు కూడా వివరాలు సమర్పించాలంది. విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. 
 
ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పరిశీలిస్తున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని వెల్లడించారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడానికి 14వ ఆర్థిక సంఘం అడ్డంకి కాదనే వాస్తవాన్ని ఈ విషయం నిరూపిస్తోందని తెలిపారు. ఈ అంశంపై గౌరవనీయ సీఎం జగన్, అన్ని పార్టీల నేతలు వెంటనే దృష్టి సారించాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments