Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకు రాజీనామా చేశానో తర్వాత చెపుతా? ఆయన సంప్రదించలేదు : లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన భవిష్యత్‌పై స్పందించారు. ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో తర్వాత చెబుతానని వెల్లడించారు. ముఖ్యంగా, తాను భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాననే విషయాన్ని వివరిస్తానని తెలిప

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (14:25 IST)
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన భవిష్యత్‌పై స్పందించారు. ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో తర్వాత చెబుతానని వెల్లడించారు. ముఖ్యంగా, తాను భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాననే విషయాన్ని వివరిస్తానని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను సంప్రదించలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన లక్ష్మీనారాయణ తన ఐపీఎస్ కొలువుకు ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈయన రాజీనామాను మహారాష్ట్ర సర్కారు ఇంకా ఆమోదించలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ, తన రాజీనామా ఆమోదం పొందడంలో ఆలస్యం జరుగుతోందని కానీ, ఉద్దేశపూర్వకంగా కాదని, వరుస సెలవుల వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన రాజీనామాపై దృష్టి సారించలేక పోతున్నారని వివరణ ఇచ్చారు. 
 
ఇకపోతే, పవన్ కల్యాణ్ జనసేన పార్టీలోకి తనను స్వాగతిస్తానని చెప్పినట్లు తాను పేపర్లో చదివానని, అలాగే పవన్ జేఎఫ్‌సీ గురించి కూడా చదివానని జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇంకా కొన్ని ఉన్నాయని, రాజీనామా ఆమోదం పొందాక ఎందుకు చేశానన్న విషయం చెబుతానని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments