Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ వాయిదా.. కేంద్రంపై ఒత్తిడి.. రెండు రోజుల పాటు బాబు ఢిల్లీ టూర్

పార్లమెంట్‌లో సోమవారం ఉభయసభలు ప్రారంభం కాగా, లోక్‌సభలో టీడీపీ, వైసీపీలు మరోసారి అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరుకావాలని టీడీపీ, వైసీపీ విప్ జారీ చేసింది. తమకు మద్దతు తెలి

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (12:42 IST)
పార్లమెంట్‌లో సోమవారం ఉభయసభలు ప్రారంభం కాగా, లోక్‌సభలో టీడీపీ, వైసీపీలు మరోసారి అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరుకావాలని టీడీపీ, వైసీపీ విప్ జారీ చేసింది. తమకు మద్దతు తెలిసిన ఎంపిలతో టిడిపి సంతకాల జాబితాను సిద్ధం చేసింది. అన్నాడీఎంకే వెనక్కి తగ్గడంతో అవిశ్వాసం నోటీసులపై ఆశలు పెరుగుతున్నాయి.
 
లోక్ సభలో రెండు వారాలుగా అవిశ్వాసం నోటీసులపై చర్చకు రాలేదని, సభ ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్ నోటీసులను పక్కన పెడుతున్నారు. అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం వెల్లడించింది. 
 
సభా కార్యకలాపాలు జరిగితే సమాధానం ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. గత కొంతకాలంగా ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ ఎంపిలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు పార్లమెంటు అవరణంలోని గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీలు నిరసన తెలిపారు. రాజ్యసభలో కావేరి బోర్డు ఏర్పాటుపై అన్నాడీఎంకే నేతలు ఆందోళనలతో మంగళవారానికి రాజ్యసభ వాయిదా పడింది. 
 
మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీకి ప్రయాణం కానున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తాను ఢిల్లీకి వెళ్ళలేదని.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఢిల్లీకి వెళ్లనున్నట్లు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో వెల్లడించారు. 
 
టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడమే మన సామర్ధ్యమని చెప్పారు. ఇంకా నాలుగు రోజులు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి. ఎంపిలంతా కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే మనకు ముఖ్యమని బాబు టీడీపీ నేతలతో అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments