Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులపైనే కేసులు.. మదనపల్లె, సీఐ, ఎస్సైలు అరెస్ట్

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:28 IST)
నేరస్తులపై కేసులు నమోదు కావడం మామూలే. అయితే చిత్తూరు జిల్లాలో ఏకంగా ఎక్సైజ్ సీఐ, ఎస్సెపై కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. మదనపల్లెలోని ఎస్బీఐ కాలనీకి చెందిన నాదెళ్ల వెంకటేశ్వరప్రసాద్‌ రెండున్నరేళ్లుగా పట్టణంలోని ఆనంద్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారన్నారు. 
 
ఇందులో ఎక్సైజ్‌ ప్రభుత్వ మద్యం డిపో సీఐ జవహర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌కుమార్‌‌లకు బార్‌లో వాటాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
ఈ క్రమంలో మద్యం విక్రయాల్లో తేడాలు రావడం.. డిపో నుంచి వైన్‌షాపులకు పంపాల్సిన మద్యాన్ని బార్‌లో ఉంచి అధిక ధరలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. వరుసగా ఇలాంటి విభేదాలతో లీజుదారుల మధ్య ఇటీవల గొడవలు జరగడంతో బార్‌ను మూసి వేశారు. 
 
సీఐ, ఎస్సై అనుచరులు ఆదివారం బార్‌ ఆక్రమణకు ప్రయత్నించడంతో వెంకటేశ్వర ప్రసాద్, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసుల అక్కడికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
 
వెంకటేశ్వర ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు సీఐ జవహర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌కుమార్‌, ఆయన అనుచరులపై ఆరు సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
ఈ ఐదుగురికి 41 నోటీసులు జారీ చేశారు. బార్‌ వివాదం కేసులో ఎక్సైజ్‌ సీఐ జవహర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments