వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు!!

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (11:44 IST)
వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ కాకినాడ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అలాగే, ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో సహా మరో 24 మందిపైనా కాకినాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
 
ఈ నెల 2వ తేదీన నగర పాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మి నగర్‌లో వైకాపా నేత సూరిబాబుకు చెందిన అక్రమ కట్టండ కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో వచ్చి గొడవకుదిగారని, రెచ్చగొట్టేలా వ్యవహరించారని పేర్కొన్నారు. 
 
ద్వారంపూడి ప్రోద్బలంతో వైకాపా కార్యకర్తలు మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగారని ఫిర్యాదు చేశారు. దీంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏ1గా, సూరిబాబును ఏ2గా, మరో 24 మందిపై కాకినాడ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments