Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ సీఎం కుమార స్వామికి షాకిచ్చిన కర్నాటక సర్కారు.. విద్యుత్ చౌర్యం కేసు!!

kumaraswamy house
, బుధవారం, 15 నవంబరు 2023 (10:32 IST)
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామికి ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. విద్యుత్ చౌర్యం కేసును నమోదు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా బెంగుళూరులోని తన నివాసానికి విద్యుత్ దీపాలను అలంకరించేందుకు ఓ కరెంట్ స్తంభం నుంచి విద్యుత్‌ను అక్రమంగా తీసుకున్నారం(చోరీ)టూ బెంగుళూరు విద్యుత్ సరఫరా సంస్థ కేసు నమోదు చేసింది. 
 
విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ వినియోగించిన వ్యవహారంపై మంగళవారం బెస్కాం ఏఈఈ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో జయనగర పోలీసులు కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదుపై మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ తన నివాసాన్ని అలంకరించే బాధ్యతను ఓ ప్రైవేటు డెకొరేటర్‌కు అప్పగించగా, కేవలం టెస్టింగ్ కోసమే బయట నుంచి విద్యుత్తు తీసుకున్నారని వివరణ ఇచ్చారు. 
 
ఆ సమయంలో తాను ఇంట్లో లేనని వివరించారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయం గుర్తించి ఇంట్లో మీటర్ నుంచి విద్యుత్తు వాడుకోవాలని సూచించినట్లు కుమారస్వామి చెప్పారు. ఇది అక్రమమని భావిస్తే అధికారులు తనకు నోటీసులు ఇచ్చి విచారణ చేపడితే జరిమానా కట్టేందుకు సిద్ధమని వెల్లడించారు. 
 
పైగా, దేశం, రాష్ట్రం మునిగిపోయేంత పని తానేమీ చేయలేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ పథకాల గురించి అప్రమత్తంగా ఉండాలని కుమారస్వామి ప్రకటించిన మరుసటి రోజే కేసు నమోదు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవంత్ రెడ్డి "ఆర్‌ఎస్‌ఎస్‌ కీలుబొమ్మ".. అసదుద్దీన్‌ ఒవైసీ