Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీలో చేరిన దళిత యువకుడు.. దాడి చేసిన కోన వెంకట్.. ఎస్‌ఐ సస్పెండ్

kona venkat

ఠాగూర్

, ఆదివారం, 12 మే 2024 (12:19 IST)
తెలుగుదేశం పార్టీలో చేరిన దళిత యువకుడిపై వైకాపా నేత, సినీ రచయిత కోన వెంకట్ దాడి చేశాడు. ఈ దాడి కూడా ఎస్ఐ జనార్థన్ సక్షమంలో జరిగింది. ఈ దాడికి సంబంధించిన వార్త వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ ఆగ్రహించి ఎస్ఐను సస్పెండ్ చేసింది. 
 
టీడీపీలో చేరిన తనపై సినీ రచయిత కోన వెంకట్, ఎస్ఐ జనార్ధన్ సహా పలువురు నాయకులు తనపై దాడిచేసిట్టు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణవరానికి చెందిన దళిత యువకుడు కత్తి రాజేశ్ ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ సమక్షంలోనే తనపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తవ్రంగా పరిగణించిన ఎస్పీ వకుల్ జిందాల్.. ఎస్‌ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే.. గణపవరం ఎస్సీ నాయకుడైన రాజేశ్ తన అనుచరులతో కలిసి శనివారం ఉదయం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్‍‌కు చేరుకుని రాజేశ్ తమ వద్ద రూ.8 లక్షలకు పైగా తీసుకుని తిరిగి ఇవ్వకుండానే టీడీపీలో చేరారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
పోలీస్ స్టేషన్‌లోనే దాడి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రాజేశ్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాపట్ల వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కోన రఘుపతి బంధువు, కర్లపాలెం మండల వైసీపీ ఇన్చార్జ్ అయిన సినీ రచయిత కోన వెంకట్, తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్ఐ సమక్షంలోనే తనపై దాడికి పాల్పడినట్టు రాజేశ్ ఆరోపించారు. 
 
ఎస్ఐ కూడా తనపై దాడికి పాల్పడినట్టు చెప్పారు. ఈ విషయం తెలిసిన టీడీపీ లోక్‌సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, అసెంబ్లీ అభ్యర్థి నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ తదితరులు పార్టీ శ్రేణులతో కలిసి కర్లపాలెం చేరుకున్నారు. అనంతరం రాజేశ్ కుటుంబం, గణపవరం ఎస్సీ కాలనీ వాసులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కోన రఘుపతి, వెంకట్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు : ఉన్నంతలో మంచి నాయకుడిని ఎన్నుకోండి ... జయప్రకాష్