Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నడలో మాట్లాడిన పాపానికి దాడి.. నటి హర్షికా పునాచా

Harshika Poonacha

సెల్వి

, శనివారం, 20 ఏప్రియల్ 2024 (08:14 IST)
Harshika Poonacha
కన్నడలో మాట్లాడినందుకు తన కుటుంబంపై గుంపు దాడి చేయడంతో బెంగళూరు వీధుల్లోకి రావాలంటేనే భయపడుతున్నానని ప్రముఖ కన్నడ నటి హర్షికా పూనాచా శుక్రవారం అన్నారు. బిజెపి సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆర్. అశోక్ శుక్రవారం ఈ సంఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్న ఇతర మహిళలు లేదా కుటుంబాల కోసం తన వాయిస్‌ను రేస్ చేస్తానని నటి చెప్పింది. కన్నడలో మాట్లాడే వారికి గుణపాఠం చెప్పాలని 20 నుంచి 30 మంది గుంపులు గుంపులుగా చెప్పారని హర్షిక అన్నారు.
 
"శాంతియుతంగా ప్రవర్తించే వారితో గొడవలు పెట్టే హక్కు ఎవరికీ లేదు. ఆ మానసిక క్షోభను అనుభవించిన తర్వాత మనం పాకిస్థాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో జీవిస్తున్నామా? స్థానిక కన్నడ భాషలో మాట్లాడటం తప్పా? మన నగరంలో మనం ఎంత సురక్షితంగా ఉన్నామా. అంటూ ఆమె ప్రశ్నించింది.
 
"రెండు రోజుల క్రితం బెంగుళూరులో ఫ్రేజర్ టౌన్ ఏరియా సమీపంలోని పులికేశి నగర్‌లోని మసీదు రోడ్‌లోని "కరామా" అనే రెస్టారెంట్‌లో ఒక సాయంత్రం నా కుటుంబంతో కలిసి క్యాజువల్ డిన్నర్ చేస్తున్నాను. మేము రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లబోతున్నప్పుడు , డ్రైవర్ సీటు కిటికీ దగ్గర అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు కనిపించారు. 
 
ఆపై ఈ కన్నడ ప్రజలకు గుణపాఠం చెప్పాలని వారు (గుంపు) అంటున్నారు. నా భర్త ముఖంపై కొట్టడానికి కూడా ప్రయత్నించారు. కొద్ది నిమిషాల్లోనే అదే ముఠాలోని 20 నుండి 30 మంది సభ్యుల గుంపు గుమిగూడి, వారిలో ఇద్దరు నా భర్తను పట్టుకున్నారు. బంగారు గొలుసును లాక్కొనేందుకు ప్రయత్నించగా నా భర్త అడ్డుకున్నారు. 
 
ఆపై నా వాహనాన్ని పాడు చేయడం ప్రారంభించారు. నన్ను మరియు నా భర్తను శారీరకంగా హింసించడానికి ప్రయత్నించారు. మా వాహనంలో మహిళలు, కుటుంబ సభ్యులు ఉన్నందున నా భర్త స్పందించలేదు.
 
మాకు తెలిసిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కి నేను అత్యవసర కాల్ చేసిన తర్వాత, ఆ గుంపు అదృశ్యమైంది. ఈ ఘటనపై ఫిర్యాదు చేశాం... అని ఆమె చెప్పుకొచ్చింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొత్తానికి వైఎస్ షర్మిల సాధిస్తోంది, ఎమ్మిగనూరులో జనమే జనం