రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని ప్రధాని మోదీకి అంకితం చేస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యుడు బీఎస్ యడ్యూరప్ప ఉద్ఘాటించారు. రాష్ట్రంలోని మొత్తం అగ్రనాయకత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
రాష్ట్రం నుండి మొత్తం 28 మంది అభ్యర్థులను గెలిపించి, వారిని న్యూఢిల్లీకి పంపిస్తానని తాను హామీ ఇస్తున్నట్లు యడ్డీ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చెప్పాను. ఈసారి తప్పకుండా ఇక్కడ అన్ని సీట్లు గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా అందజేస్తామని యడ్యూరప్ప పునరుద్ఘాటించారు.
దీనికి సంబంధించి అన్నీ అనుకూలంగా వుందని యడ్డీ వెల్లడించారు. ఏప్రిల్ 14న కోస్తా నగరం మంగళూరులో, రాజధాని బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని వివరించారు. బీజేపీలో టిక్కెట్ల కేటాయింపు సందర్భంగా తలెత్తిన తిరుగుబాటు, అసమ్మతి ఇప్పుడు సద్దుమణిగింది. ఇప్పుడు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.