Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇండస్ట్రీకి అండగా ఉంది : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

vijayedraprasad, anjali,  Mallu Bhatti Vikramarka, kona venkat, siddu jonnlagadda

డీవీ

, బుధవారం, 10 ఏప్రియల్ 2024 (14:57 IST)
vijayedraprasad, anjali, Mallu Bhatti Vikramarka, kona venkat, siddu jonnlagadda
నటి అంజలి ప్రస్తుతం "గీతాంజలి మళ్లీ వచ్చింది" చిత్రం చేసింది. ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శతక్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని  ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.  ఈ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, సిద్దు జొన్నలగడ్డ గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, డైరెక్టర్ వశిష్ట గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘భట్టి విక్రమార్క గారు నాకు 35 ఏళ్ల నుంచి తెలుసు. ఆయన ఎంతో కష్టపడ్డారు. సిద్దు చేసిన ఎల్‌బిడబ్ల్యూ చూసి వెంటనే ప్రెస్ మీట్ పెట్టాను. ఆ టైంలో సిద్దు ఎవరో, ఆ టీం మెంబర్స్ ఎవరో తెలీదు. మా ఈ స్టేజ్ మీదున్న ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. గీతాంజలి చిన్న కాన్సెప్ట్‌తో తీశాం. అది చాలా పెద్ద హిట్ అయింది. సీక్వెల్స్‌లో టిల్లు స్క్వేర్ రికార్డులు క్రియేట్ చేసింది. మా సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాం. అంజలికి ఇది 50వ సినిమా. మా చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. శివ నిర్వాణ, హరీష్ శంకర్, ప్రవీణ్ లక్కరాజు, శ్రీజో వంటి వారిని నేను పరిచయం చేశాను. ఇప్పుడు శివ తుర్లపాటి పరిచయం అవుతున్నారు. మా ఈవెంట్‌కు వచ్చిన సిద్దు, విజయేంద్ర ప్రసాద్ గారికి, విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్’ అని అన్నారు.
 
భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ.. ‘మిత్రులు కోన వెంకట్, పెద్దలు విజయేంద్ర ప్రసాద్, ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ నమస్కారాలు. తెలుగు పరిశ్రమకు మంచి విజయాలు రావాలని ఉగాది సందర్భంగా కోరుకుంటున్నాను. కోన గారు నాకు ఎన్నో ఏళ్ల నుంచి మిత్రులు. వ్యక్తిగతంగా, రాజకీయంగా మాకు ఎంతో అనుబంధం ఉంది. గీతాంజలి మళ్లీ వచ్చింది పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మధ్య తరగతి వాళ్లని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సాధనమే సినిమా. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది సినిమా పరిశ్రమ. ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీకి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్దంగా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి అండగా నిలబడుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా ఎలాంటి సాయం అయినా చేసేందుకు సిద్దంగా ఉన్నాం. నన్ను ఈవెంట్‌కు పిలిచిన మిత్రులు కోన వెంకట్ గారికి థాంక్స్’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్.టి.ఆర్. దేవర నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు పొందిన కరణ్ జోహార్