Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంటర్ టైన్ మెంట్ తో మలిచిన హారర్ చిత్రంగా గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్

Gitanjali malli vachindi Trailer poster

డీవీ

, బుధవారం, 3 ఏప్రియల్ 2024 (13:02 IST)
Gitanjali malli vachindi Trailer poster
హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటించిన  హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’.  ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ  ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్ లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. బుధవారంనాడు ఈ సినిమా ట్రైలర్ హైదరాబాద్ త్రిబుల్ ఎ థియేటర్ లో విడుదలచేసింది చిత్రయూనిట్.
 
ట్రైలర్...
రచయిత శ్రీనివాస్ రెడ్డి డైలాగ్.. ఓపెన్ చేస్తే అర్థరాత్రి ఒంటిగంటకు డీప్ స్లీప్ లో వుండగా ఓ ఏడుపు వినపడింది. అది ఎవరని వెతుకుంటావ్ అని గీతాంజలి (అంజలికి) చెబుతుండగా ఆమె వెతుకున్నట్లు చూపించడం. ఆ తర్వాత షాక్ కు గురయి గట్టిగా అరవడం జరుగుతుంది.
 
ఓ బోయపాటి శీను, ఓ త్రివిక్రమ్ శీను, ఓ వైట్ల శీను, సెనక్కాయల శీను.. అంటూ శీనివాస్ రెడ్డి తన గురించి చెప్పుకుంటూ.. ఓ సీన్ చేయడానికి కెమెరా్ మెన్ సునీల్ తోపాటు నటీనటులు సత్య, అంజలి తదితరులతను పాడుపడిన బంగ్లాలోకి తీసుకెళ్ళి షూట్ చేస్తారు. అక్కడ వింతవ్యక్తులు కనిపిస్తే... వీరంతా మెథడ్ యాక్టర్స్ అంటూ శీనివాస్ రెడ్డి సర్ది చెబుతాడు. 
 
మరో షాట్ లో దెయ్యాలు వున్నాయని ఒకరు లేరని మరొకరు వాదించుకుంటూ షాట్ లో వుండగానే అసలు దెయ్యాలు వచ్చి హల్ చల్ చేస్తాయి. ఆ తర్వాత.. చిన్నపాప దగ్గర అలీ వచ్చి నువ్వు మణిరత్నం గీతాంజలివి కాదే.. కోన వెంకట్ గీతాంజలివి. దెయ్యంలా తగులుకున్నావ్.. అంటూ డైలాగ్ లో ముగుస్తుంది.
 
ఇలా హారర్, వినోదంతోకూడిన ట్రైలర్ లో శీనివాసరెడ్డి, కోన వెంకట్ హైలైట్ అయ్యేలా సంభాషణలు వున్నాయి. ఇక నటీనటుల నటన వినోదాన్ని పండిస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్  11 న విడుదల చేయనున్నారు.
 
చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ, గీతాంజలి సినిమా చేసే సమయానికి నేను 45 సినిమాలకు వర్క్ చేసి ఉన్నాను. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనిపించి చేసిన సినిమాయే గీతాంజలి. శ్రీనివాస్ రెడ్డి నా దగ్గరకు రాజ్ కిరణ్‌ని తీసుకొచ్చాడు. హారర్ మూవీగా ఉన్న ఆ కథను కామెడీ హారర్‌గా మార్చాను. సీక్వెల్ రావటానికి పదేళ్లు పట్టింది. గీతాంజలి 2ను అమెరికాలో చేద్దామని అనుకున్నాను. కానీ టెక్నికల్, ప్రాక్టికల్ అంశాల కారణంగా సినిమాను ఊటీకి మార్చి చేశాం. సత్య, సునీల్, రవిక్రిష్ట, రాహుల్ మాధవ్, అలీ సినిమాకు అడిషన్స్ అయ్యారు. సినిమాను ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే ఆడియెన్స్ చూడటానికి వస్తారో దాన్ని మించి ఎంజాయ్ చేస్తారు  అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్కశెట్టి ఇన్ స్టా ఫోటో వైరల్.. మళ్లీ ఫామ్‌లోకి దేవసేన