నటి అంజలి 'గీతాంజలి' ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం "గీతాంజలి మళ్లీ వచ్చింది" చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శతక్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. అంజలికి ఇది 50వ చిత్రం.దీంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకంగా మారింది. హారర్ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
అంజలి మాట్లాడుతూ గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ చాలా బాగా వచ్చింది. సినిమా దీని కంటే వంద రెట్లు బావుంటుంది. నా 50వ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండాలని అనుకున్నాను. ఆ కోరిక గీతాంజలి మళ్ళీ వచ్చిందితో తీరింది. నా ఎంటైర్ టీమ్ మనసు పెట్టి ఈ మూవీ చేశారు. అందరూ ఎంటర్ టైన్ కావాలనే ఉద్దేశంతోనే సినిమా చేశాం. కోన వెంకట్ గారికి థాంక్స్. స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించాం. త్వరలోనే దాన్ని రిలీజ్ చేస్తాం. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్ అవుతుంది. కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి చేసిన సినిమా. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.
చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ గీతాంజలి మాకెంతో స్పెషల్ మూవీ. గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇంకా చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే ఇది అంజలికి 50వ సినిమా. ఆమెను అభినందించాల్సిందే. ఓ తెలుగు అమ్మాయి 50 సినిమాలు చేయడటమంటే గొప్ప విషయం. ఇప్పుడింకా గొప్పగా రాబోతుంది. గీతాంజలి ఐడియాను నా దగ్గరకు తెచ్చింది శ్రీనివాస్ రెడ్డినే. ఆ సినిమా సక్సెస్ మా టీమ్‌ను కలిపింది. నేను 55 సినిమాలకు రైటర్ గా వర్క్ చేశాను. అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది మాత్రం భాను, నందు. సామజవరగమన, భైరవకోన సినిమాలకు వాళ్లు వర్క్ చేశారు. ఈ స్క్రిప్ట్ లో కీలక పాత్రను పోషించారు. కథను నేనిచ్చినా వాళ్లు దాన్ని 10 మెట్లు ముందుకు తీసుకెళ్లారు. ప్రవీణ్ లక్కరాజుని జూనియర్ తమన్ అని పిలుస్తుంటాం. మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఛోటా కె.ప్రసాద్ చాలా కీలక పాత్రను పోషించాడు. డైరెక్టర్ శివకి ఇదొక బెస్ట్ మూవీ అవుతుంది. ఏప్రిల్ 11న మూవీని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాం అన్నారు. ట్రైలర్‌లో చూసింది కొంతే.. సినిమా ధమ్ బిర్యానీలా ఉంటుంది అన్నారు.