Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదు

Webdunia
గురువారం, 7 మే 2020 (17:35 IST)
వైజాగ్ నగరంలో తీవ్ర విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదైంది. వేకువ జామున ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి లీకైన విషవాయువు తీవ్ర ప్రభావం చూపింది.

ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. గ్యాస్ లీకేజీకి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైందని వెల్లడించారు.

ప్రస్తుతం గ్యాస్ లీకేజీ నిలిచిపోయిందని, ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీటిని పిచికారి చేసి వాతావరణంలో విషవాయువు ప్రభావాన్ని నియంత్రించినట్టు మంత్రి వివరించారు.

పరిశ్రమల శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషవాయు ప్రభావం ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి ఒకటిన్న కిలోమీటరు పరిధిలో అధికంగా ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments