Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులు : హైపర్ కమిటీ ఏర్పాటు - సభ్యులు వీరే

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (12:17 IST)
రాజధాని తరలింపు విషయంపై ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ తన నివేదిక ఇచ్చింది. వచ్చే నెల మూడో తేదీన బోస్టన్ కన్సల్టెంట్ కంపెనీ మరో నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ కమిటీల నివేదికలపై అధ్యయనం చేసేందుకు మంత్రులు, ప్రభుత్వ అధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 
 
ఈ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో జగన్ కెబినెట్‌లోని పలువురు మంత్రులు, ముఖ్య అధికారులు ఉన్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఓ స్పష్టత ఇవ్వనుంది. కాగా, ఈ కమిటీలో సభ్యుల వివరాలను పరిశీలిస్తే, 
 
మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నానిలు ఉన్నారు. 
 
వీరితో పాటు ముఖ్యమంత్రి ప్రదాన సలహాదారు, రాష్ట్ర డీజీపీ, చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటీ, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులకు ఈ కమిటీలో చోటు కల్పించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments