ఏపీఎస్ ఆర్టీసీలో 15 నుంచి బుకింగ్

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:08 IST)
ఏపీఎస్ ఆర్టీసీ బుకింగ్స్‌ను ప్రారంభిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి బస్ బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడం వల్ల లాక్‌డౌన్ పొడిగిస్తారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది.

ఇప్పటికే లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, వ్యాపార రంగాలు కుదేలయ్యాయి. మళ్లీ పొడిగిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ప్రతిపాదనను పక్కన పెట్టేస్తుందని అధికార వర్గాల సమాచారం. 
 
వివరాల్లోకెళితే.. ఏపీఎస్ ఆర్టీసీ బుకింగ్స్‌ను ప్రారంభిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి బస్ బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. 
 
ఏసీ బస్సుల బుకింగ్స్‌ను మాత్రం నిలిపివేసింది. అది కూడా విజయవాడ బస్టాండ్ నుంచి వెళ్లే సర్వీసులను మాత్రమే ప్రారంభించింది. 115 సర్వీసులకు టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించిన ఆర్టీసీ.. కరోనా ప్రభావం తగ్గితే దశల వారీగా బస్సుల బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments