Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ - ఇప్పటికే 1179 కేసులు

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (08:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఒకవైపు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ ఆందోళన కలిగిస్తోంది. సోమవారం వరకు 1179 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకాగా అందులో 40 మంది కరోనా బారిన పడకుండా నేరుగా బ్లాక్ ఫంగస్ బారినపడినవారు ఉండటం గమనార్హం. ప్రస్తుతం 1068 మంది చికిత్స పొందుతున్నారు. 14 మంది బాధితులు మృతి చెందగా 97 మంది బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
ముఖ్యంగా కరోనా బారిన పడినవారిలో సైతం ఫంగస్ ఆనవాళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. దీంతో ఇలా ఎందుకు జరుగుతోందని వైద్య నిపుణులు సయితం తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి 40 కేసులను రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాకపోయినప్పటికీ సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాంతకమే అవుతుంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో వందలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ బారినపడి నిత్యం మరణిస్తున్నారు. దానికి తోడు తాజాగా బ్లాక్ ఫంగస్ కరోనా రోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. 
 
ముఖ్యంగా కరోనా సోకి తగ్గిన వారిలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నవారు... కరోనా సమయంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారిలో ఈ ఫంగస్ వెలుగుచూస్తోందని నిన్న మొన్నటి వరకు భావించారు. తాజాగా అసలు కరోనా సోకనివారిలో సయితం ఫంగస్ ఛాయలు కనిపిస్తుండడంతో మరో గుబులు మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం