Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌ యుద్ధ నౌక ఖార్గ్‌ మునిగిపోయింది.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (21:47 IST)
Iran Ship
ఓమన్ గల్ఫ్‌లో ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌక ఖార్గ్‌ మునిగిపోయింది. ఓడలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మునిగిపోవడానికి ముందు పేలుడు సంభవించి మంటలు అంటుకున్నట్లుగా నేవీ అధికారులు చెప్తున్నారు. ఈ సంఘటన ఇరాన్ ఓడరేవు జాస్క్ సమీపంలో జరిగింది. పేలుడుకు గల కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
 
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.25 గంటలకు ఖార్గ్ యుద్ధనౌకపై మంటలు ప్రారంభమైనట్లు ఇరాన్ స్టేట్ టీవీ తెలిపింది. ఈ యుద్ధనౌకపై సైనిక విన్యాసాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇరాన్‌కు చెందిన అతిపెద్ద యుద్ధనౌకను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లైఫ్ జాకెట్లు ధరించిన సిబ్బంది సభ్యుల వీడియో ఇరాన్‌లో వైరల్ అవుతుంది. సిబ్బంది వెనుక ఓడ మంటల్లో కనిపిస్తుంది.
 
ఈ యుద్ధనౌకను బ్రిటన్‌లో నిర్మించారు. 1977 లో సముద్రంలో అందుబాటులోకి తీసుకురాగా.. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత 1984 లో ఇరాన్ నావికాదళానికి తిరిగి కేటాయించారు. యుద్ధనౌక భారీ సరుకును ఎత్తడమే కాకుండా ఏకకాలంలో టేకాఫ్, అనేక హెలికాప్టర్లను ల్యాండింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments