Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బ్లాక్ ఫంగస్ - అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ చాపకిందనీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. నిజానికి ఒకవైపు కరోనా, మరోవైపు బ్లాక్‌ ఫంగ్‌స రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 
రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే 1,600 కేసులు నమోదయ్యాయి. వారిలో 98 మంది చనిపోయారు. ప్రతి రోజు సగటున 80 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య వందలకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వైద్య నిపులు చెబుతున్నారు.
 
ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే.. భవిష్యత్తులో కేసులతో పాటు మరణాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల రెండో వారం పూర్తయ్యే నాటికి 2,100 కేసులు, మూడో వారం నాటికి సుమారు 2,700 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవుతాయని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. 
 
రాష్ట్రంలో పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఏర్పాట్లు మాత్రం చేయడం లేదు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో అత్యధికంగా 380 ఫంగస్‌ కేసులున్నాయి. చిత్తూరులో 200, కృష్ణాలో 195, అనంతపురం 166, కర్నూలు 160, విశాఖపట్నంలో 160 కేసుల వరకూ ఉన్నాయి. 
 
ఫంగస్‌ మరణాలు కూడా ఈ ఆరు జిల్లాల్లోనే అధికంగా నమోదవుతున్నాయి. విశాఖపట్నంలో ఇప్పటి వరకూ అత్యధికంగా 15 మంది బ్లాక్‌ఫంగ్‌సతో మృతి చెందారు. అదేసమయంలో బ్లాక్‌ ఫంగ్‌సకు మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఫంగస్‌ నుంచి బయటపడాలంటే యాంపోటెరిసిన్‌-బి ఇంజక్షన్లు, పోసోకోనజల్‌ ఇంజక్షన్లు, మందులు అవసరం. కానీ ఈ మందుల కొరత రాష్ట్ర వ్యాప్తంగా వేధిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments