Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్లిసిటీ కోసం వర్మను ఫాలో అవుతున్న ఉండవల్లి : సుధీర్ రాంబొట్ల

Webdunia
ఆదివారం, 31 జనవరి 2021 (08:53 IST)
పబ్లిసిటీ కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ రామ్‌ గోపాల్‌వర్మను ఫాలో అవుతున్నారని బీజేపీ సీనియర్ నేత సుధీష్ రాంబొట్ల ఎద్దేవ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై ఉండవల్లి అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉండవల్లి అంటే మేధావి అనుకున్నాం. ఉండవల్లి చెప్పిన పుస్తకాల్లో అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 
 
ఉండవల్లికి హిందూ మతం గురించి తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్వామి వివేకానంద, అంబేద్కర్ వ్యాఖ్యలను తప్పులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, కమ్యునిస్ట్ పార్టీలకు వితండవాదం ఎక్కువని చెప్పారు. ఉండవల్లి వ్యాఖ్యలను ఖండించకపోతే‌ దేశ భద్రతకే‌ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఉండవల్లి ఆర్ఎస్ఎస్, బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదని సుధీష్‌ రాంభొట్ల హెచ్చరించారు. 
 
వివేకానంద, అంబేడ్కర్ రచనలుని వక్రీకరించారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు ఉండవల్లి రావాలని లేదా ఆయన ఎక్కడ పెడితే అక్కడకు నేను వస్తానని సవాల్ విసిరారు. 
ముఖ్యంగా మతం మారేవారందరు దళితులే అన్ని ఉండవల్లి చేప్పుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి, రాబర్ట్ వాద్రా, అహ్మద్ పటేల్‌లు కూడా మతం మారారు. మరి వారందరూ దళితులేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బిట్ర వెంకట శివన్నారాయన పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments